నారాయణరావు పవార్.. తెలంగాణకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. నిజాం పాలనపై పోరాటం చేసినందుకు ఆయనను ‘తెలంగాణ భగత్ సింగ్’ అని పిలుస్తారు. చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నిరంకుశ పాలనను అంతం చేసేందుకు 1947 DEC 4న నిజాంపై బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో నిజాం బయటపడడంతో పవార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు. హైదరాబాద్ భారత్‌లో కలిసిన తర్వాత ఆయనను విడిచిపెట్టారు.