VKB: గ్రామ పంచాయతీ పోరులో పల్లెల్లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ప్రధాన పార్టీల తరపున ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఒకే గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాగా బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. పలుగు రాళ్ల తండా, ఉడిమేశ్వరం తదితర గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొంది.