W.G: ప్రతి ఒక్కరు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించాలని జిల్లా ఆహార భద్రత అధికారి సుందర రామరెడ్డి సూచించారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వీరమ్మ పార్క్ ఎదుట ఫుడ్ స్టాల్స్ సుందర రామరెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. వినియోగదారులకు, పర్యాటకులకు మంచి ఆహారం అందించాలని సూచనలు చేశారు. తప్పనిసరిగా తలకు, చేతులకు గ్లోవ్స్ వినియోగించాలన్నారు.