MBNR: చిన్న చింతకుంట మండలం బండ్రవల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ తిరుపతికి మద్దతుగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం బ్యాట్ గుర్తుపై ఓటు వేసి లక్ష్మీ తిరుపతిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.