AP: అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఆయన ఈరోజు, రేపు శాన్ఫ్రాన్సిస్కోలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి అమెరికా పర్యటన సాగుతోంది. అలాగే, ఈనెల 10న కెనడాలోని టొరంటోలో కూడా ఆయన పర్యటించనున్నారు.