రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందం త్వరలోనే ప్రారంభం కానుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. హమాస్ మరొక బందీ మృతదేహాన్ని అప్పగించాల్సి ఉందని.. అది పూర్తయితే రెండో దశ ప్రారంభమవుతుందని తెలిపారు. అలాగే మూడో దశలో గాజా నుంచి తీవ్రవాదాన్ని దూరం చేస్తామన్నారు. అయితే ఇది అసాధ్యమని అంటున్నారని.. గతంలో పలు దేశాల్లో జరిగినట్లే ఇక్కడ జరుగుతుందని పేర్కొన్నారు.