NLR: కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కావలి బుడంగుంట గేట్ సమీపంలో పాన్ శేఖర్ అనే వ్యక్తి నుండి 2.04 కేజీల గంజాయిని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి గంజాయిని తరలించి కావలి ప్రాంతంలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని సీఐ రాజేశ్వరరావు పేర్కొన్నారు.