EG: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని డ్రిల్ మాస్టర్, శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఆదివారం దేవరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పరమేష్ బయోటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ క్రీడల్లో సుమారు 300 మంది పాల్గొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని ఆయన వెల్లడించారు.