MBNR: BRS పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు సంక్షేమం లభిస్తుందని దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పూర్తిగా విఫలం అయిందన్నారు.