NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏసీపీ రాజ వెంకట్ రెడ్డి ఆదివారం జాక్రాన్పల్లి పోలీస్ స్టేషను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా సంక్లిష్ట గ్రామాలు, హాట్స్పాట్ ప్రాంతాల్లో, ప్రతి గ్రామంలో బందోబస్తు, సిబ్బంది కేటాయింపు, రౌండ్లు, పికెటింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటుపై పలు సూచనలు చేశారు.