SRD: 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు బీసీలు ఐక్యంగా పోరాటం చేయాలని బీసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్ అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం యువత ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. పోరాటాల ద్వారానే రిజర్వేషన్లు సాధించుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ తరహా బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలన్నారు.