E.G: రాజమహేంద్రవరంలో నిర్వహించిన జీ తెలుగు ‘ఆట 2.0’ ఆడిషన్స్‌లో కొవ్వూరుకు చెందిన జీ. వాసంతి, ఎం. జ్వాలామృత ప్రతిభ చాటారు. సుమారు 500 మంది పాల్గొన్న ఈ పోటీల్లో జూనియర్స్ విభాగంలో వీరు ఎంపికయ్యారు. ఓ డాన్స్ అకాడమీలో శిక్షణ పొందిన తన విద్యార్థులు జాతీయ స్థాయి వేదికకు ఎంపిక కావడంపై డాన్స్ మాస్టర్ ఎం. శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.