NRPT: నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాజాపూర్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం ఎస్సై రాముడు పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో సౌకర్యాలు పరిశీలించారు. సీసీ కెమెరాలు, క్యూలైన్ల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్లో విద్యుత్ సౌకర్యాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో ఎన్నికల సమయంలో పటిష్ఠ పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.