చైనాలోని షాంఘైలో భారత కాన్సులేట్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. చైనాలో భారత రాయబారి అయిన ప్రదీప్ కుమార్ రావత్ దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చైనాలోని భారత ప్రతినిధులు, ఇతర విదేశీ దౌత్యవేత్తలతో సహా 400 మంది ప్రముఖులు హాజరయ్యారు. కాగా, షాంఘై చైనాలో ప్రధాన వాణిజ్య కేంద్రం కావడం గమనార్హం.