»It Is Known How Much Virat Kohli Earns Per Post On Instagram
Instagram:లో విరాట్ ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తాడు..క్లారిటీ ఇచ్చిన కోహ్లీ
భారత జట్టులోని డైనమిక్స్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(virat kohli) ఒక్కరు. తనకు క్రేజ్ మాములుగా ఉండదు. పాకిస్తాన్లో సైతం కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే విరాట్ తన ఇన్ స్టా ఖాతాలో 256 మిలియన్ల ఫాలోవర్లతో ఉండగా..తాను ఒక్క పోస్ట్ చేస్తే ఎంత సంపాదిస్తారో ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
it is known how much virat kohli earns per post on instagram
ఇండియాలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు ఇటు ఇన్ స్టా(instagram)లో కూడా విరాట్ ప్రస్తుతం 256 మిలియన్ల మంది ఫాలోవర్లను కల్గి ఉన్నాడు. అయితే విరాట్ ఇన్ స్టా ఖాతాలో ఒక్క పోస్ట్(one post) చేస్తే ఎంత సంపాదిస్తారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ రిపోర్టు ప్రకారం విరాట్ 2023లో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి స్పాన్సర్డ్ పోస్ట్‌కు రూ.11.45 కోట్లు వసూలు చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా విరాట్ కోహ్లీనే. రిపోర్ట్ ప్రకారం అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌కు 1.38 మిలియన్ డాలర్లు తీసుకున్నాడు. అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో ఇండియాలో ఇన్ స్టా సంపాదిస్తున్న ఏకైక వ్యక్తి కూడా కోహ్లీ కావడం విశేషం.
అయితే ఈ వార్తపై స్పందించిన విరాట్ కోహ్లీ ఇందులో నిజం లేదని, తన సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారం చేస్తున్న వార్త అబద్ధమని ఓ ట్వీట్ చేస్తూ స్పష్టం చేశారు.
While I am grateful and indebted to all that I’ve received in life, the news that has been making rounds about my social media earnings is not true. 🙏
ఈ జాబితాలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానం(top)లో ఉండగా, అతని ప్రధాన ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ తర్వాతి స్థానంలో నిలిచారు. ఇక రొనాల్డో విషయానికొస్తే అతను ఏకంగా USD 3.23 మిలియన్ల భారీ మొత్తాన్ని వసూలు చేశాడు. ఇది మన కరెన్సీలో రూ.26.75 కోట్లు. మరోవైపు మెస్సీ ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు USD 2.56 మిలియన్లు తీసుకున్నాడు. ఇది హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం ఒక్కో పోస్ట్‌కు రూ.21.49 కోట్లగా ఉంది. ఈ జాబితాలో ఉన్న భారతీయుల్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తర్వాతి స్థానంలో 29వ స్థానంలో ఉన్నారు. ఆమె ఒక్కో పోస్ట్‌కు USD 532,000 (రూ.4.40 కోట్లు) వసూలు చేస్తున్నారు.