KNR: కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న పంచాయతీ సైదాపూర్ కార్మికులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మొలుగూరి ప్రేమ్ కుమార్తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వారు మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.