బెంగళూరులోని ఓ కేఫ్‌లో నిమ్మకాయ జ్యూస్‌కు వేసిన గ్యాస్ క్రైసిస్ బిల్లు SMలో వైరల్ అవుతోంది. రెండు జ్యూస్‌ల ధర రూ.358. దీనికి తోడు గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ 5 శాతం (రూ.17.01) వేశారు. నిమ్మకాయ జ్యూస్‌కు గ్యాస్ ఛార్జ్ అని బిల్లు వేయటమేంటని జనం మండిపడుతున్నారు. దీంతో ఆ హోటల్‌కు వినియోగదారుల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.