TG: కూకట్పల్లిలో హవాలా నగదు దోపిడీ కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. శంషాబాద్ నుంచి లక్నో వెళ్లేందుకు నిందితులు యత్నించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, హవాలా నగదు రూ.కోటితో దుండగులు పరారయ్యారు.