విపక్ష కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి అంతర్జాతీయ పరంగా ఆర్థిక విధానలు తెలియవని, ఓ విజన్ అంటూ ఆ పార్టీకి ఏదీ లేదని, నిజాయతీ లేని పార్టీ అని ప్రధాని మోదీ (Pm Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్(Parliament)లో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఇండియా పేదరికంలో బతికిందన్నారు. 2028లో కూడా తమపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడతాయని, కాంగ్రెస్ పార్టీకి భారత వ్యాక్సిన్‌పై, ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై విశ్వాసమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్షాలకు పాకిస్తాన్‌పై ప్రేమ కనిపిస్తోందే కానీ దేశంపై చూపలేదన్నారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ లాంటి పలు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్‌కు నో కాన్ఫిడెన్స్ చెప్పినట్లు గుర్తు చేశారు. క్రమక్రమంగా కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం తగ్గుతోందన్నారు. మేకిన్ ఇండియా(Make in India) అంట కాంగ్రెస్ పార్టీకి ఎగతాళి అయ్యిందన్నారు.
ఇండియాను అప్రతిష్టపాలు చేసేందుకే విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మోదీ(Pm Modi) ఫైర్ అయ్యారు. అసత్య ప్రచారాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటైపోతోందని విమర్శించారు. ఇండియాలోని సంక్షేమ పథకాల్ని ఐఎంఎఫ్ కూడా ప్రశంసించినట్లు తెలిపారు. జల జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, అభియాన్ వంటి పథకాలు కొన్ని లక్షల మంది జీవితాలను నిలబెట్టాయన్నారు. ఇప్పుడు విపక్ష కూటమి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
దేశానికి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని, దేశ ప్రతిష్టలను ఖండాంతరాలకు విస్తరింపజేసినట్లు మోదీ(Pm Modi) అన్నారు. 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నో బాల్‌గానే మిగిలిపోయినట్లు గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయిన అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయని, పేదవారి జీవితాల కంటే వారికి అధికార దాహమే ఎక్కువగా ఉందని ప్రధాని మోదీ విమర్శించారు.