KNR: కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్.హెచ్.ఓ)గా 2023 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహం సునీల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి పోలీసు యంత్రాంగం పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కోసం ఆయనను ఇక్కడ నియమించారు. రానున్న 3 నెలల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.