»Revanth Reddy Said That Kcr And Ktr Would Be Begging If There Was No Congress Party 63436
Revanth Reddy: మేము లేకుంటే KCR, KTR అడుక్కుతినేవాళ్లు
కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము లేకపోతే ఇద్దరు నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా టెంపుల్ దగ్గరనో లేదా ఆదివారం మెదక్ చర్చి వద్దనో అడుక్కుతినే వారని అన్నారు.
Revanth Reddy said that KCR and KTR would be begging if there was no Congress party.
Revanth Reddy: తెలంగాణ(Telangan) రాష్ట్రంలో కేసీఆర్(KCR) ప్రభుత్వాన్ని గద్దే దించేడమే తమ లక్ష్యమని ప్రతి పక్షనేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. నాలుగు రోజులు జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కాకుండా కేవలం కాంగ్రెస్(Congress) తిట్టడానికే సమయాన్ని వృధా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ది పనులు శూన్యం. కానీ దేశంలో ప్రగతి సాధిస్తానని వేళ్తున్నారు. ఇక్కడ సొమ్ము మొత్తం పక్కరాష్ట్రాల్లో పంచిపెడుతున్నారని విమర్షించారు.
తండ్రీకొడుకులు(KCR, KTR) నోరు తెరిస్తే కాంగ్రెస్ పై విరుచుపడుతున్నారని, అసలు ఈ పార్టీ లేకపోతే వీళ్లకు బతుకేలేదని అన్నారు. వీరి మీద దయతలచి 2004లో పార్టీ బిక్షం పెట్టకపోతే వారు నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా టెంపుల్ దగ్గరనో లేదా ఆదివారం అయితే మెదక్ చర్చి వద్దనో అడుక్కుతినే వారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు టీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ లో పోటీ చేసినప్పుడు కనీసం జెండా పట్టుకోవడానికి కూడా కార్యకర్తలు లేనప్పుడు దగ్గరుండి గెలిపించానని, కేసీఆర్ను భూజాల మీద మోశానని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఎన్నికల పోరుకు సిద్దం అవుతున్నామని, ఆయన్ను రాజకీయంగా సమాది కడుతానని అన్నారు.
2004లో కాంగ్రెస్ పార్టీ బిక్షం పెట్టుకుంటే కేసీఆర్, కేటీఆర్ నాంపల్లి దర్గా దగ్గర, బిర్లా టెంపుల్ మెట్ల మీద, మెదక్ చర్చి దగ్గర అడుక్కుతినేవారు – రేవంత్ రెడ్డి pic.twitter.com/1VUPkDGwTy