MLG: ములుగు మార్కెట్ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ రేషన్ బియ్యంపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో సయ్యద్ రఫీ ఇంట్లో 28.55 క్వింటాళ్ల ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రేషన్ షాపుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం. సయ్యద్ రఫీ, జాకారం గ్రామానికి చెందిన ఇండ్ల శంకర్‌పై కేసు నమోదు చేశారు.