పెరిగిన టమాట ధరలను చూసి ప్రజలు లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా టమాట చోరీలు కూడా ఎక్కువవుతున్నాయి. తాజాగా ఓ మార్కెట్లో కూరగాయల షాపు నుంచి 40 కిలోల టామాటలను దొంగిలించారు (tomatoes stolen). దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తంగ్రా కూరగాయల మార్కెట్లోని 66 షాపుల నుంచి సుమారు 40 కిలోల టమాటాలు, 10 కిలోల అల్లం, 2 లక్షల విలువైన తూకం యంత్రాలు, నగదు, వస్తువులు చోరీకి గురయ్యాయి. ఉదయం మార్కెట్‌కు వచ్చిన కూరగాయల వ్యాపారులు తమ షాపుల తాళాలు పగులగొట్టి ఉండటం చూసి షాక్ అయ్యారు.
తమ దుకాణంలో చోరీ జరిగిన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ చీరీలపై నిరసనగా కూరగాయల మార్కట్లోని వ్యాపారులంతా తమ షాపులను మూసి వేశారు. టమాటా దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.