W.G: తణుకులో 2014-19లో ప్రారంభమైన 950కు పైగా టిడ్కో ఇళ్లను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వంలో పనులు నిలిచిపోయి భవనాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం పనులను మళ్లీ ప్రారంభించి త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని చెప్పారు.