AP: LPG నిల్వలు, బుకింగ్, సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలకుండా తీసుకుంటున్న చర్యలపై గ్యాస్ కంపెనీ ప్రతినిధులను సీఎం ఆరా తీశారు. డెలివరీ సమయంలో దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఆస్పత్రులు, బడులు, ఆలయాలకు ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పారు. ఎల్పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటల్ సంఘాలతో మాట్లాడాలన్నారు.