అన్నమయ్య: బి.కొత్తకోటలో నెలకుని ఉన్న నీటి సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలతో కలసి సోమవారం సీపీఐ నాయకులు ధర్నా చేశారు. నగర పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలతో కలసి బైటాయించి నిరసనలు తెలిపారు. కొత్తపేట వీధి, కాళికమ్మ గుడి వీధి, పంజారమ్మ గుడి వీధి, హడ్కో వీధి, మాల వీదుల్లో నెలకొన్న సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.