TG: హైదరాబాద్ ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధి ఫరూక్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫరూక్నగర్ బస్ డిపో పక్కనున్న పరుపుల దుకాణంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో దుకాణం అగ్నికి ఆహుతి అయింది. అంతేకాదు.. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు కూడా వ్యాపించడంతో.. స్పాట్‌కు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.