TG: బడ్జెట్ సమావేశాల వేళ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సభ ప్రారంభంలో ‘వందేమాతరం’ గీతం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ వందేమాతరం గీతాలాపన ప్రారంభించాల్సిందిగా సూచించగానే, ఎంఐఎం ఎమ్మెల్యేలు తమ సీట్ల నుంచి సభ వెలుపలికి వెళ్లారు. గీతాలాపన పూర్తయిన తర్వాత తిరిగి సభలోకి ప్రవేశించారు.