BPT: వేమూరు మండలంలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు ఏడుగురు విద్యార్థులు హాజరుకాలేదని ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. వేమూరు ప్రభుత్వ పాఠశాలలో 116 మందిలో 110 మంది, పెరవలి పాఠశాలలో 79 మందిలో 78 మంది పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాన్ని తహశీల్దార్ సుశీల, SI శ్రీనివాసరావు తనిఖీ చేశారు.