విజయనగరం మండలం సుంకరిపేటలో ‘రైతన్న మీకోసం’ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఆమె నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి రైతుకు అండగా ఉంటామని ఆమె భరోసానిచ్చారు.