MHBD: మరిపెడ మండలం గాలివారిగూడెంలో సోమవారం సీసీ కెమెరాలను ఎస్సై వీరభద్రరావు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ స్నేహ శబరిష్ సూచన మేరకు సర్పంచ్ కవిత సుదర్శన్ రెడ్డి తమ సొంత ఖర్చులతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై వీరభద్రరావు ప్రారంభించి సర్పంచ్‌ను సన్మానించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నేరాలు తగ్గుతాయని ఎస్సై పేర్కొన్నారు.