AP: మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి ఆర్థికపరమైన వెసులుబాట్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేంద్ర నిధుల వినియోగం, ప్రస్తుత ఆర్థిక స్థితిగతులపై అధికారులకు వివరించారు.