KRNL: ఆదోని మండలం జాలమంచి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు రైతుల ఇళ్లకు వెళ్లి వారి ఖాతాల్లో జమైన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల గురించి సోమవారం వివరించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతు అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని సీనియర్ నాయకులు పేర్కొన్నారు.