Kuppamలో రెచ్చిపోయిన మూకలు, ఆర్టీసీ బస్సుపై దాడి, అద్దాలు ధ్వంసం
పుంగనూర్ ఘర్షణలు కుప్పానికి పాకాయి. అక్కడ ఆర్టీసీ బస్సును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని తెలిసింది. బస్సుపై దాడి జరిగిన సమయంలో అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
Kuppam: పుంగనూరులో చంద్రబాబు (chandrababu) పర్యటన సందర్భంగా జరిగిన ఉద్రిక్తత వాతావరణం కంటిన్యూ అవుతూనే ఉంది. టీడీపీ- వైసీపీ శ్రేణులు పరస్పర దాడులతో హై టెన్షన్ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారో లేదో.. పక్కనే గల కుప్పంలో (kuppam) అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సుపై తమ ప్రతాపం చూపించారు.
బస్సుపై దాడి.. 40 మంది ప్రయాణికులు
కుప్పం (kuppam) డిపోకు చెందిన బస్సు కృష్ణగిరి (krishnagiri) నుంచి తిరుమల (tirumala) వెళ్తుండగా బస్సుపై దాడి జరిగింది. ఆ బస్సులో 40 మంది ఉన్నారు. అందులో ఉన్న తమిళనాడుకు (tamilnadu) చెందిన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఈ రోజు ఉదయం వరకు ఆర్టీసీ బస్టాండ్లో భయపడుతూనే ఉన్నారు. అల్లరి మూకల దాడిలో బస్సు ముందట ఉన్న అద్దం దెబ్బతింది. మరోవైపు పుంగూర్ దాడి ఘటనకు నిరసనగా ఈ రోజు (శనివారం) వైసీపీ బంద్కు (bandh) పిలుపునిచ్చింది. దీంతో చిత్తూరు జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోగా.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో బంద్ (kuppam) పాటించాలని దుకాణాలను వైసీపీ శ్రేణులు బలవంతంగా మూసివేయించారు.
ఆర్టీసీ బస్సుపై (rtc bus) వైసీపీకి (ycp) చెందిన కొందరు దాడి చేశారు. దాడిలో అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు (passengers) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికార పార్టీకి చెందిన వారే ఇలా చేస్తే అనే ప్రశ్న వస్తోంది. బస్సుపై (bus) దాడి చేసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు (locals) డిమాండ్ చేస్తున్నారు. పుంగనూర్ ఘటనను అడ్డు పెట్టుకొని తాము ఉన్న బస్సుపై (bus) దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రయాణికులు అంటున్నారు. ఆ సమయంలో గుండెలను అరచేతిలో పెట్టుకున్నామని చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన వారే ఇలా చేస్తే.. ఎలా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. సహనంగా ఉండాల్సింది పోయి.. దాడులకు తెగబడతారా అని నిలదీస్తున్నారు. ప్రజల భద్రతకు రక్షణగా ఉండాల్సిన అధికార పార్టీ శ్రేణుల దాడి సరికాదని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రాయలసీమలో ఇకనైనా పరిస్థితులు మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
కుప్పం ఆర్టీసి బస్టాండులో బస్సు పై దాడి చేసిన దుండగులు
కుప్పం నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఏపీ అసెంబ్లీ ఎన్నికకు మరో 10 నెలల సమయం ఉంది. అయినప్పటికీ ప్రజలను కలిసేందుకు నేతలు పర్యటిస్తున్నారు. పుంగనూర్లో చంద్రబాబు (chandrababu) పర్యటన ఉద్రిక్తతకు కారణమైంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) అనుచరులు రాళ్లదాడితో యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఇటు నుంచి టీడీపీ కార్యకర్తలు (tdp workers) రెచ్చిపోవడం.. వైసీపీ శ్రేణులు ప్రతిదాడితో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు (police) రంగ ప్రవేశం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఇరువైపులా కార్యకర్తలు గాయపడ్డారు. వివాదం సద్దుగణించే క్రమంలో పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి.