BPT: కొరిశపాడు మండలంలోని రావినూతల జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఎమ్మార్వో సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కేంద్రాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలి రోజు పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై కూడా ఆరా తీశారు.