Pawan Kalyan Suggested Party Workers Do Not React Bro Movie Comments
Pawan Kalyan: బ్రో మూవీపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మూవీపై వైసీపీ నేతలు చేస్తోన్న కామెంట్లపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. రాజకీయాలు చేసేందుకు సినిమాలు తనకు ఇంధనం అన్నారు. తన సినిమాల గురించి వైసీపీ నేతలు మాట్లాడతారని అన్నారు. రాజకీయాల్లోకి సినిమాను తీసుకురావొద్దని కోరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇష్యూను డైవర్ట్ చేసేందుకు వైసీపీ నేతలు అలా మాట్లాడుతారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఏపీలో హ్యుమన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉందన్నారు. చిన్న పిల్లలు, మహిళలు ట్రాఫికింగ్ జరుగుతోందని.. తానే కాదు నోబెల్ అవార్డు గ్రహీత తెలిపారు. ఆ సినిమా చేసి వదిలేశానని.. మీరేందుకు మాట్లాడాతారని జనసేన శ్రేణులను కోరారు. మీరు పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు బ్రో మూవీపై జరిగే రాద్దాంతపై స్పందించొద్దు అని సూచించారు.