SDPT: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బెజ్జంకి మండలానికి చెందిన ఉద్యోగులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ నినాదాలు చేశారు.