అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రైల్వేశాఖ(SCR) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,801 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల కోసం APR 11లోగా దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 50శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ (NCVT/SCVT) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ముందుగా (RDAT/NAPS) పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పోస్టులకు అప్లై చేయాలి.