ATP: కళ్యాణదుర్గం మండలం కడదరకుంట గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరులు పుష్పలత టీడీపీ, పోలీసుల వేధింపులు భరించలేక సోమవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పలతను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.