AP: రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేశారని కేంద్రమంత్రి పెమ్మసాని అన్నారు. ఆయన త్యాగం నుంచి తెలుగు చరిత్ర పుట్టిందని తెలిపారు. కుటుంబసభ్యులను పోగొట్టుకుని దేశం కోసం పోరాడారని గుర్తుచేశారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాల హక్కుల కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం పొట్టిశ్రీరాములు త్యాగానికి సమాధానం అని పెమ్మసాని పేర్కొన్నారు.