ELR: లింగపాలెం మండలం రంగాపురం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కిరాయి పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న బాబు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.