ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న 'పుష్ప2'పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య మాత్రం పుష్పరాజ్ కాస్త సైలెంట్ అయిపోయాడు. దాంతో కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై క్లారిటి వచ్చేసినట్టేనని చెప్పొచ్చు.
Puspa2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్పమూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తగ్గేదేలే మ్యానరిజమ్, సాంగ్స్ వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యాయి. పుష్ప-2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప2 షూటింగ్ రెండు, మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. 2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ సంబంధించిన కొన్ని వీడియోస్ లీక్ అయ్యాయి. దాంతో పుష్ప 2 షూటింగ్ రయ్యున దూసుకుపోతుందని అనుకుంటున్నారు.
సినిమాపై వస్తున్న కొన్ని వార్తలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఓ ఛానల్లో పుష్ప షూటింగ్ 85 శాతం కంప్లీట్ అయ్యిందనే న్యూస్ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్లో 65 శాతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయిందని ప్రసారం చేసింది. దాంతో ఆ న్యూస్‌ని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. పుష్పరాజ్ తగ్గేదేలే.. అస్సలు తగ్గేదేలే.. అంటూ హల్చల్ చేస్తున్నారు. ఈ విషయం కాస్త పుష్ప మేకర్స్ దృష్టికి వెళ్లింది. దాంతో సుకుమార్ సన్నిహిత పీఆర్వో ఒకరు దీనిపై క్లారిటీ ఇచ్చారు. పుష్ప2 షూటింగ్ పై వస్తున్న వార్తలని నమ్మకండి.. అవి అన్నీ రూమర్సేనని చెప్పుకొచ్చాడు. కానీ.. పుష్ప2 షూటింగ్ అప్డేట్ మాత్రం చెప్పలేదు. అసలు ఇప్పటి వరకు ఎంత షూట్ జరిగింది? సినిమా రిలీజ్ ఎప్పుడు? కొత్త స్టార్ క్యాస్టింగ్ ఎవరు? అనే విషయంలో మాత్రం చిత్ర యూనిట్ అప్డేట్ ఇవ్వడం లేదు.
చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ షూటింగ్ అప్ డేట్ ఇస్తే బెటర్ అని చెప్పొచ్చు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. మళయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పుష్ప-2తో సుకుమార్, అల్లు అర్జున్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.