Hero Tarun reacts to marriage rumors with Niharika.
Tarun: టాలీవుడ్(Tollywood)లో ఒకప్పటి లవర్ బాయ్ హీరో తరుణ్ (Tarun) మెగా డాటర్ పెళ్లి పుకార్లు జోరందుకున్నాయి. నిహారికా(Niharika) లేదంటే శ్రీజ (srija)ని పెళ్లి(Wedding) చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలపై తరుణ్ స్పందించారు. పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పుకార్లు ఎలా వస్తున్నాయో తనకే తెలియడం లేదన్నారు. తన గురించి ఏ విషయం అయినా తానే చెబుతా అన్నారు. ఆధారం లేని వార్తలు ఎవరు నమ్మొద్దని, పెళ్లి విషయం ఉంటే తాను స్వయంగా ఆ శుభవార్త అందరితో పంచుకుంటానని తెలిపారు.
తరుణ్ తల్లి రోజా రమణి (Roja Ramani) ఇటివలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కొడుకు తరుణ్‌కి త్వరలోపెళ్లి చేయబోతున్నట్లు చెప్పారు. కాబోయే కోడలు ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అని మీ అందరికి తెలుసన్నారు. పరిశ్రమలో ఓ బడా ఫ్యామిలీకి చెందిన కూతురు అని చెప్పడంతో ఆ వార్త నెట్టింట్లో వైరల్ అయింది. దాంతో చాలా మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికా, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పేర్లు వినిపించాయి. దీంతో సోషల్ మీడియాలో ఆ విషయం చక్కర్లు కొట్టింది. తరుణ్ స్పందించడంతో ఈ విషయానికి పుల్‌స్టాప్ పడినట్టయ్యింది.