కృష్ణా: 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు గుడ్లవల్లేరు మండలంలో మొత్తం 516 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌతవరం, డోకిపర్రు, గుడ్లవల్లేరు, అంగలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.