NLR: బుచ్చి( M) పురందర పురం గ్రామంలో పట్టపగలు వీధిలైట్లు వెలుగుతూ దర్శనమిస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వెలిగే లైట్లతో విద్యుత్ వృధా అవుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధిలైట్ల పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజా ధనం వృధా అవుతుందని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి వీటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.