PPM: గుమ్మిడిగూడ పంచాయతీ సింగుపురం గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు ఇది. అత్యవసర సమయాల్లో 108 కూడా వెళ్ల లేని దుస్థతి. గర్భిణులు, రోగులకు కాలినడకే దిక్కు. గత వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రస్తుత ప్రభుత్వం అయినా రోడ్డు నిర్మాణం చేపడితే బాగుండని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.