KRNL: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో 160 కేంద్రాల్లో 35,920 మంది, నంద్యాల జిల్లాలో 130 కేంద్రాల్లో 26,521 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.