బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పటికే ‘ఎటర్నల్ సన్‌షైన్’ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా ఆమె ‘ఎటర్నల్ కిడ్స్’ పేరుతో మరో ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. ఇందులో ‘C, G, M’ అనే మూడు థ్రిల్లింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, మొదటిది తన తాతయ్య రాసిన కథల ఆధారంగా ఉంటుందని తెలిపింది. మనలో నిశ్శబ్దంగా ఉన్న చిన్నారిని కలిసేలా ఈ కథలు ఉంటాయని అలియా పేర్కొంది.