AKP: జిల్లాలో ఈనెల 16 నుంచి ‘రైతన్న–మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, సాంకేతికత, ఆహార శుద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు ఈనెల 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో నిర్వహిస్తామని ఆమె సూచించారు.