AKP: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిణి ప్రవీణ తెలిపారు. నేటి నుంచి పరీక్షలకు వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా డీలక్స్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.